Pakistan: అల్లాహ్ నాకు ఆ అధికారమే ఇస్తే... : షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు

Will eat grass but raise Pakistan Army budget says Shoaib Akhtar
  • అల్లాహ్ అధికారం ఇస్తే ఆర్మీ బడ్జెట్ పెంచుతా
  • గడ్డి తినైనా సరే ఆ పని చేస్తా
  • నాతో చర్చించాలని ఆర్మీ చీఫ్ ను కోరతా 
పాక్ జట్టులో ఉన్నప్పుడు తన పదునైన బంతులతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్... రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన పదునైన మాటలతో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. తన దేశ ఆర్మీ బడ్జెట్ ను పెంచడం కోసం గడ్డి తినడానికి కూడా తాను సిద్ధమేనని తాజాగా వ్యాఖ్యానించాడు.

'అల్లాహ్ నాకు అధికారం ఇస్తే... గడ్డి తినైనా సరే నా దేశ ఆర్మీ బడ్జెట్ ను పెంచుతా' అని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ ఆర్మీతో కలిసి దేశ సివిల్ సెక్టార్ ఎందుకు కలిసి పనిచేయదో తనకు అర్థం కాదని చెప్పాడు. తనతో కూర్చుని, చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోవాలని ఆర్మీ చీఫ్ ను కోరతానని తెలిపాడు. ఒకవేళ ఆర్మీ బడ్జెట్ 20 శాతంగా ఉంటే.. దాన్ని తాను 60 శాతం చేస్తానని చెప్పాడు. మనమంతా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే... చివరకు మనమే నష్టపోతామని తెలిపాడు.
Pakistan
Army
Shoaib Akhtar

More Telugu News