Mahesh Babu: 'ప్రియమైన అభిమానులకు..' అంటూ కీలక సూచన చేసిన మహేశ్ బాబు

Maheshbabu A kind request to all my fans
  • మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం
  • నా పుట్టినరోజు ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని భావిస్తున్నారు 
  • మీరు చేస్తోన్న మంచి పనులకు చాలా సంతోషం
  • సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలి
ఈ నెల 9న తన పుట్టినరోజు వేడుక ఉండడంతో ఈ విషయంపై సినీనటుడు మహేశ్ బాబు తన అభిమానులకు కీలక సూచన చేశాడు. 'ప్రియమైన అభిమానులకు.. మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తోన్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపాడు. 

'అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తోన్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేశ్ బాబు' అని ఆయన ఓ ప్రకటన చేశాడు.
Mahesh Babu
Tollywood
Corona Virus

More Telugu News