Donald Trump: టిక్ టాక్ కు డెడ్ లైన్ పై సంతకం పెట్టేసిన డొనాల్డ్ ట్రంప్!

Trump Signs on Executive Order on Tiktok
  • 45 రోజుల గడువు విధించిన ట్రంప్
  • ఆపై బైట్ డ్యాన్స్ తో సంప్రదింపులు ఉండరాదు
  • ఏ లావాదేవీనీ అంగీకరించబోమని ఉత్తర్వులు
చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్, తన మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో ఏవైనా సంప్రదింపులు జరపాలని భావిస్తే, 45 రోజుల్లోగా పూర్తి చేసుకోవాలని, ఆపై యూఎస్ టిక్ టాక్ యూనిట్ మరే లావాదేవీ జరుగకుండా ఆదేశాలు జారీ చేస్తూ, కార్య నిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని, జాతీయ భద్రత, రక్షణ నిమిత్తం టిక్ టాక్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు. గడువు తరువాత బైట్ డ్యాన్స్ లిమిటెడ్ తో అన్ని రకాల లావాదేవీలనూ నిషేధిస్తున్నట్టు ఆదేశించారు.

కాగా, చైనాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, ఇంతవరకూ సుంకాలను పెంచుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు, ఇటీవలే టిక్ టాక్ యాప్ ను యూఎస్ లో నిషేధిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆపై మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ యూఎస్ యూనిట్ ను సొంతం చేసుకునేందుకు పావులు కదపడం ప్రారంభించిందన్న వార్తలు కూడా వెలువడ్డాయి.
Donald Trump
TikTok
Executive Orders

More Telugu News