Andhra Pradesh: నాలుగు నెలల నుంచి అందని జీతాలు.. నిరసనకు దిగిన ఏపీ సెక్రటేరియట్ స్వీపర్లు!

AP Secretariat sweepers protest against govt
  • సచివాలయానికి సమీపంలో నిరసన
  • ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్
  • జీతాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. సెక్రటేరియట్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో, ఉన్నతాధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వంతో చర్చించి జీతాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మందడంలో అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు. వారికి సమీపంలో సచివాలయానికి వెళ్లే రోడ్డుపైనే స్వీపర్లు కూడా నిరసన చేపట్టడంతో పోలీసులు బందోబస్తును ముమ్మరం చేశారు.
Andhra Pradesh
AP Secretariat
Sweepers
Protest

More Telugu News