Yanamala: రాజధాని రైతులకు సహకరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది: యనమల

Yanamala wants Centre must intervene into AP Capital issue
  • కేంద్రం చొరవ చూపాలన్న యనమల
  • రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమేనని స్పష్టీకరణ
  • ఆర్టికల్ 355(సి)ని ప్రస్తావించిన యనమల
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు సహకరిస్తానని బీజేపీ మాటిచ్చిందని అన్నారు. అమరావతి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని తెలిపారు.

రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 355 (సి) మేరకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో టీడీపీ ముమ్మర పోరాటం చేస్తోంది. చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు తమ విమర్శల్లో పదును పెంచారు.
Yanamala
Amaravati
AP Capital
BJP
Centre
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News