Chandrababu: సిగ్గు లేకుండా మాకు డెడ్ లైన్ పెట్టడం ఏమిటి?: జోగి రమేశ్

YSRCP is ready to take Chandrababus challenge says Jogi Ramesh
  • 14 నెలల క్రితమే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు
  • ఏపీలో ప్రతిపక్షమే లేదు
  • చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాదుకు పారిపోయారు
రాజధాని విషయంలో దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ తన 23 ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వారిని మళ్లీ గెలిపిస్తే... చంద్రబాబు సవాల్ స్వీకరించడానికి వైసీపీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే జోగి రమేశ్ చెప్పారు. రెండు రోజులకు ఒకసారి చంద్రబాబు చెప్పే సోది వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.

14 నెలల క్రితమే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని... అయినా సిగ్గు లేకుండా తమకు డెడ్ లైన్ పెట్టడం ఏమిటని జోగి రమేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి నుంచి హైదరాబాదుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండాలా? వద్దా? అనే విషయంపై ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు.
Chandrababu
YSRCP
Telugudesam
Jogi Ramesh
Jagan

More Telugu News