Corona Virus: ఏపీలో 2 లక్షలకు చేరువలో కేసుల సంఖ్య.. తాజా అప్డేట్స్!

Corona cases in AP reaching 2 laks
  • 24 గంటల్లో కొత్తగా 10,128 కేసుల నమోదు
  • 77 మంది కరోనాతో మృతి
  • 1,86,461కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
ఏపీలో కరోనా కేసుల విస్తరణకు అడ్డుకట్ట పడటం లేదు. నిన్న కొంత మేర తగ్గిన కేసులు గత 24 గంటల్లో మళ్లీ పెరిగాయి. మొత్తం 10,128 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1544, కర్నూలు జిల్లాలో 1368, అనంతపురం జిల్లాలో 1260 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,86,461కి చేరుకుంది.

గత 24 గంటల్లో 77 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏకంగా 16 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 8,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,35,646 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
Corona Virus
Andhra Pradesh
cases
deaths

More Telugu News