Narendra Modi: పొరుగు దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడు: మోదీ

Ram is there in our neighbors culture also says Modi
  • ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యం
  • భూమిపూజలో పాల్గొనడం నా అదృష్ణం
  • మనందరిలో రాముడు ఉన్నాడు
ప్రపంచమంతా రామమయమేనని ప్రధాని మోదీ అన్నారు. మన పొరుగునున్న దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడని చెప్పారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని చెప్పారు. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని చెప్పారు.

అయోధ్య భూమిపూజలో పాలుపంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మన దేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని... రాముడు అనేది ఒక సత్యమని  చెప్పారు. మనందరిలో రాముడు ఉన్నాడని చెప్పారు. రాముడు అనేది ఒక జాతీయ సెంటిమెంట్ అని అన్నారు. అయోధ్య భూమిపూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi
Ayodhya Ram Mandir
BJP

More Telugu News