Chandrababu: ఈ వీడియో చూసి షాక్ అయ్యాను!: చంద్రబాబు
- పలాసలో దళిత యువకుడిపై ఓ పోలీసు దాడి
- అతడి తల్లి అడ్డుకుంటున్నప్పటికీ వదలలేదు
- జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?
- మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారు
వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండాపోతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ నేతల ఆదేశాలతో శ్రీకాకుళంలోని పలాసలో ఓ పోలీసు దళిత యువకుడిని తన్నారని, అతడి తల్లి అడ్డుకుంటున్నప్పటికీ వదలలేదని చెప్పారు' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
'వైఎస్ జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు' అని లోకేశ్ విమర్శించారు.
'శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్లపట్టా అడిగినందుకు పలాస, టెక్కలిపట్నం గ్రామస్థుడు మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేశారు. న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డుపై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సీఐ' అని లోకేశ్ మండిపడ్డారు. వైకాపా నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.