Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం డిజైన్లు ఇవిగో!

BJP leaders shares pictures of proposed Ram Mandir designs in Ayodhya
  • రేపు అయోధ్యలో భూమి పూజ
  • శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
  • రామ మందిరం డిజైన్లను ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు
అయోధ్యలో రేపు రామ మందిరం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ ప్రతిష్ఠాత్మకమైన ఆలయం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనిపై కొన్ని డిజైన్లను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రామ మందిరం ప్రతిపాదిత నమూనాలు ఇవేనంటూ ప్రచారం చేస్తున్నారు. భారతీయ నిర్మాణశైలిని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక శోభను చాటుతూ, దివ్యత్వాన్ని వెదజల్లుతున్నాయని, మొత్తమ్మీద భారతీయ వైభవాన్ని చాటేలా రామ మందిరం ఉండబోతోందని బీజేపీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
Ayodhya Ram Mandir
Designs
BJP
Leaders

More Telugu News