Kruti Sanon: కృతి సనన్ కి బాలీవుడ్ లో భారీ ఆఫర్!

Kruti Sanon opposite Hrutik in Krish sequel
  • తెలుగులో రెండు సినిమాలు చేసిన కృతి 
  • బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ బిజీ
  • హృతిక్ రోషన్ కి జంటగా క్రిష్ 4లో ఛాన్స్
మొదట్లో 'నేనొక్కడినే', 'దోచేయ్' వంటి తెలుగు సినిమాలలో నటించిన కృతి సనన్ కి ఆ తర్వాత బాలీవుడ్ నుంచి ఒక్కసారిగా ఆఫర్లు రావడంతో ఇక అక్కడే తన కెరీర్ ని లాగిస్తోంది. తెలుగు నుంచి స్టార్ హీరోల సినిమాల కోసం అడిగినప్పటికీ, ఆమె డేట్స్ కేటాయించలేని పరిస్థితి. హిందీలో వరుస ఆఫర్లతో ఆమె అంత బిజీగా వుందక్కడ. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు అక్కడ మరో భారీ చాన్స్ వచ్చినట్టు సమాచారం.

హృతిక్ రోషన్ హీరోగా రూపొందే 'క్రిష్ 4' చిత్రంలో కథానాయికగా నటించే చాన్స్ కృతికి తాజాగా వచ్చినట్టు సమాచారం. మొదట్లో ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్, అలియా భట్ వంటి టాప్ స్టార్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కృతి సనన్ తో ఒప్పందం ఖరారైంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక కృతి రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.

క్రిష్ సీరీస్ అనగానే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ వుంది. గతంలో ఈ సీరీస్ లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడీ క్రిష్ 4లో హృతిక్ ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు రాకేశ్ రోషన్ ఇప్పటికే స్క్రిప్టు పని పూర్తిచేస్తున్నారట.
Kruti Sanon
Hrutik Roshan
Rakesh Roshan
Katrina Kaif

More Telugu News