Nara Lokesh: జగన్ ఎందుకు జంకుతున్నట్టు?: లోకేశ్

Why Jagan is afraiding to go to elections questoins Nara Lokesh
  • జగన్ సహా అందరూ జై అమరావతి అన్నారు
  • అమరావతిలో జగన్ సొంతిల్లు నిర్మించుకున్నారని వైసీపీ నేతలు అన్నారు
  • ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ సహా వైసీపీ నేతలంతా ఎన్నికల ముందు జై అమరావతి అని నినదించారని చెప్పారు. తమ అన్న జగన్ అమరావతిలో సొంతిల్లు నిర్మించుకున్నారని అన్ని ప్రాంతాల వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెప్పారని అన్నారు.

ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు జగన్ గారు? అని ప్రశ్నించారు. మూడు ముక్కలాటలో ఎలాంటి స్వార్థం లేకపోతే... ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నట్టు? అని ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Amaravati

More Telugu News