Ramcharan: మేనకోడలితో కలసి ఇంట్లో డ్యాన్స్ చేసిన రామ్ చరణ్.. వీడియో ఇదిగో

Ramcharan Dance off with this darling
  • అభిమానులను అలరిస్తోన్న డ్యాన్స్
  • 'ఈ డార్లింగ్‌తో డ్యాన్స్' అంటూ చెర్రీ వ్యాఖ్య
  • ట్విట్టర్‌లో చురుకుగా ఉంటోన్న చెర్రీ
కరోనా వైరస్‌ విజృంభణతో ఇళ్లకే పరిమితమైన సినీనటులు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. సినీనటుడు రామ్‌చరణ్ తన సోదరి శ్రీజ కూతురు నవిష్కతో కలిసి ఇంట్లో డ్యాన్స్ చేశాడు. ఇంట్లో టీవీ ముందు నవిష్కతో ఆయన చేయించిన డ్యాన్స్‌ కు సంబంధించిన వీడియో అభిమానులను అలరిస్తోంది.

'ఈ డార్లింగ్‌తో డ్యాన్స్' అంటూ చెర్రీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ట్విట్టర్ ఖాతాలో తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
Ramcharan
Tollywood
Viral Videos

More Telugu News