వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న గంటా?

వైసీపీ చేప్టటిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో గంటా చేరబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఆగస్ట్ 15వ తేదీన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరిగినా... తాజాగా 16వ తేదీని ఫిక్స్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా గంటా వర్గానికి చెందిన పలువురు కూడా పార్టీలో చేరబోతున్నారు.

YSRCP
Ganta Srinivasa Rao
Telugudesam

More Telugu News