Corona Virus: కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP govt releases orders to give financial assistance to corona death person family
  • అంత్యక్రియల ఖర్చు కోసం  రూ. 15 వేలు
  • ప్లాస్మా దానం చేసిన వారికి రూ. 5 వేలు
  • జిల్లా కలెక్టర్లకు రూ. 12 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు
కరోనా మృతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ. 15 వేలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్లాస్మాను దానం చేసే వారికి రూ. 5 వేలు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. దీని కోసం జిల్లా కలెక్టర్లకు రూ. 12 కోట్ల చొప్పున విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Corona Virus
Andhra Pradesh
Deaths

More Telugu News