Manchu Vishnu: అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న మంచు విష్ణు, కాజల్!

Manchu Vishnu and Kajal Aggarwal are playing brother and sister characters
  • 'మోసగాళ్లు' చిత్రంలో నటిస్తున్న మంచు విష్ణు, కాజల్
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు
  • దర్శకత్వం వహిస్తున్న హాలీవుడ్ డైరెక్టర్
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ 'మోసగాళ్లు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమా కథకు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపాడు.

మన ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందనే నమ్మకం తనకుందని చెప్పాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ హీరో, హీరోయిన్లు కొన్ని సినిమాలలో అన్న, చెల్లిగా నటించడం బాలీవుడ్ లో కూడా జరిగింది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లు అన్న, చెల్లెలు పాత్రల్లో నటించారు.
Manchu Vishnu
Kajal Aggarwal
Tollywood

More Telugu News