Telangana: తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపిన రాష్ట్ర కమిటీ కూర్పు

Raja Singh expressed dissatisfaction on New State Committee
  • బీజేపీలో నన్ను మరోసారి పక్కన పెడుతున్నారు
  • గ్రూపు రాజకీయలను ఆపాలి
  • బండి సంజయ్ కి రాజాసింగ్ వాట్సాప్ మెసేజ్
తెలంగాణ పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటులో తన అభిప్రాయం తీసుకోలేదని... తన నియోజకవర్గం నుంచి కమిటీలో ఒక్కరికి కూడా స్థానం లభించలేదని విమర్శించారు. తన నియోజకవర్గంలో సమర్థులు ఒక్కరు కూడా లేరా? అని ప్రశ్నించారు.

బీజేపీలో తనను మరోసారి పక్కనపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సాప్ ద్వారా ఆయన మెసేజ్ పెట్టారు. కనీసం మీ నాయకత్వంలోనైనా రాష్ట్ర బీజేపీలో మార్పు వస్తుందని భావించానని.. కానీ, తనకు అది కనిపించడం లేదని చెప్పారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ఆపేందుకు ప్రయత్నించాలని విన్నవించారు. అందరం కలసికట్టుగా పని చేసి, పార్టీని బలోపేతం చేద్దామని చెప్పారు.
Telangana
BJP
Raja Singh
Bandi Sanjay

More Telugu News