Chiranjeevi: మీ ఇద్దరూ కొట్టుకోకుండా చెరో కానుక... చెల్లెళ్లతో రాఖీ కట్టించుకుంటూ చిరంజీవి చమత్కారం

Chiranjeevi gifted his sisters after they tied Rakhis
  • రాఖీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
  • అన్నయ్యకు రాఖీ కట్టిన విజయదుర్గ, మాధవి
  • ట్విట్టర్ లో వీడియో పంచుకున్న చిరంజీవి
ఇవాళ రాఖీ పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్నారు. చిరంజీవి చెల్లెళ్లయిన విజయదుర్గ, మాధవి తమ అన్నయ్యకు రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి కానుకలు అందిస్తూ... మీ ఇద్దరూ కొట్టుకోకుండా చెరొకటి ఇస్తున్నానంటూ చమత్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా చెల్లెళ్లిద్దరితోనే కాదు, తెలుగింటి ఆడపడుచులందరితో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

Chiranjeevi
Rakhi
Sisters
Madhavi
Vijayadurga
Tollywood

More Telugu News