Narendra Modi: అయోధ్య రామ మందిరం భూమిపూజ ఇన్విటేషన్ లో మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు.. ఇన్విటేషన్ కార్డు ఇదిగో!

Invite For Grand Ayodhya Event Names 3 Others With PM Modi
  • కాషాయం రంగులో ఇన్విటేషన్ కార్డు
  • మోదీ చేతుల మీదుగా భూమి పూజ
  • విశిష్ట అతిథిగా మోహన్ భగవత్
అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ అయింది. కాషాయం రంగులో ఉన్న ఈ కార్డుపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు.

విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ రావ్ భగవత్ పేరును పేర్కొన్నారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది. కార్డుపై బాల రాముడి చిత్రాన్ని ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రికను దాదాపు 150 మంది అతిథులకు పంపినట్టు సమాచారం.
Narendra Modi
Mohan Bhagawat
Ayodhya Ram Mandir
Invitation card

More Telugu News