Telangana: పోతిరెడ్డిపాడు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

TPCC Chief Uttam Kumar Reddy fires on KCR once again

  • పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతోంది
  • అదే జరిగితే తెలంగాణకు చుక్కనీరు కూడా రాదు
  • టెండర్లు పూర్తి కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని, ఆ పనులు మొదలైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాల్సిందేనని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని, ఫలితంగా నాగార్జున సాగర్, పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తికి చుక్క నీరు కూడా రాదని అన్నారు. పోతిరెడ్డిపాడు టెండర్లను గత నెల 11నే ఆహ్వానించినట్టు తెలుస్తోందని, అవి పూర్తికావాలన్న ఉద్దేశంతోనే అపెక్స్ కౌన్సిల్ భేటీని కేసీఆర్ వాయిదా వేశారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే, రెండు టీఎంసీల కోసం కాళేశ్వరానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు.

Telangana
Congress
Uttam Kumar Reddy
KCR
pothireddypadu
  • Loading...

More Telugu News