Sushant Singh Rajput: ‘మహా’ సీఎం ఉద్ధవ్ థాకరేపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ తీవ్ర ఆరోపణలు

Uddhav Thackeray Under Bollywood Mafia Pressure Says Sushil Modi
  • బాలీవుడ్ మాఫియాకు కాంగ్రెస్ అండ
  • కాంగ్రెస్ ఒత్తిడితోనే నిందితులకు కొమ్ముకాస్తున్న ఉద్ధవ్
  • బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు సహకరించలేదు
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు మహారాష్ట్ర, బీహార్ మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. సుశాంత్ కేసును కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముకాస్తున్నారని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అండదండలతోనే ఇదంతా జరుగుతోందని, కాంగ్రెస్ నేతలు బీహార్ ప్రజలకు ఇకపై ముఖం ఎలా చూపించుకుంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ మాఫియాకు కాంగ్రెస్ పూర్తి అండగా ఉంటోందని ఆరోపించారు. ఆ పార్టీ ఒత్తిడి వల్లే నిందితులకు ఉద్ధవ్ థాకరే అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాచక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కోసం ముంబై వెళ్లిన బీహార్ పోలీసులకు అక్కడి వారి నుంచి సరైన సహకారం లభించలేదని ఆరోపించారు.
Sushant Singh Rajput
Mumbai
Uddhav Thackeray
Sushil Modi

More Telugu News