Mohan Babu: మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు... మిమ్మల్ని వదలబోమంటూ హెచ్చరించిన దుండగులు

Speeding car rammed into Mohan Babu house and warns his family members
  • మోహన్ బాబు నివాసం వద్ద కారు కలకలం
  • ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద కొందరు దుండగులు తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. హైదరాబాదులోని మోహన్ బాబు నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది ఆదమరిచి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మళ్లీ అదే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించింది ఎవరన్నది ఆసక్తికర అంశంగా మారింది.
Mohan Babu
Car
Men
Warning
Police
Hyderabad

More Telugu News