Kangana Ranaut: కంగన నివాసం వద్ద కాల్పులు.. పోలీసు బందోబస్తు ఏర్పాటు!

Firing at Kangana Ranauts home
  • మనాలీలోని కంగన నివాసం వద్ద కాల్పులు
  • ఎవరో బెదిరిస్తున్నారన్న సినీ నటి
  • కాల్పులతో బెంబేలెత్తిపోయిన స్థానికులు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నివాసం వద్ద కాల్పులు కలకలం రేపాయి. మనాలీలో కంగనకు ఓ సొంత ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె అక్కడే ఉంటోంది. ఈరోజు ఆ ఇంటి వద్దే కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై కంగన స్పందిస్తూ, తొలుత వాటిని తుపాకీ చప్పుళ్లు అనుకోలేదని... రెండోసారి కూడా శబ్దాలు వినిపించడంతో కాల్పులు అనే విషయం అర్థమైందని చెప్పింది. ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Kangana Ranaut
Bollywood
Firing

More Telugu News