Corona Patient: అనంతపురం జిల్లాలో ఘోరం.. కరోనా పేషెంట్ ను రోడ్డు మీద వదిలి వెళ్లిన 108 సిబ్బంది!

  • కరోనా పాజిటివ్ తో ప్రభుత్వాసుపత్రిలో చేరిన గోపినాయక్
  • నడిరోడ్డుపై వదిలి వెళ్లిన 108 సిబ్బంది
  • కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
కరోనా రోగిని ఏమాత్రం జాలి లేకుండా 108 సిబ్బంది రోడ్డు మీద వదిలి వెళ్లిన ఘటన విమర్శలకు తావిస్తోంది. కరోనా రోగులను ప్రేమతో చూడాలని ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెపుతున్నా సిబ్బందికి చెవికెక్కడం లేదు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన గోపినాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో వైద్యం అందిస్తున్నప్పటికీ నయం కాకపోవడంతో... నిన్న అర్ధరాత్రి 108 సిబ్బంది అతడిని అంబులెన్సులో తీసుకెళ్లి రోడ్డుపై వదిలేశారు. అచేతన స్థితిలో ఉన్న గోపినాయక్ ను చూసి స్థానికులు చలించిపోయారు. అతని వద్ద నుంచి వివరాలు తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి ఆయనను స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Corona Patient
Anantapur District
108 Staff

More Telugu News