Nitya Menon: వెబ్ సీరీస్ వైపు మరో కథానాయిక అడుగులు

Nitya Menon interested in web series
  • వెబ్ సీరీస్ వైపు ప్రముఖ తారల మొగ్గు 
  • తనకూ ఆఫర్లు వస్తున్నాయన్న నిత్యా  
  • ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందట  

ఈ రోజు సినిమాలకు ప్రత్యామ్నాయంగా వెబ్ సీరీస్ నిలుస్తున్నాయి. మంచి పారితోషికం ఆఫర్ చేయడంతో చాలా మంది హీరోయిన్లు అటు మొగ్గుచూపుతున్నారు. అందుకే, కాజల్, సమంత, తమన్నా .. వంటి తారలు ఇప్పటికే కొన్ని వెబ్ సీరీస్ కి కమిట్ అయిపోయారు. ఈ క్రమంలో వెబ్ సీరీస్ కి తను కూడా రెడీ అంటోంది నిత్యా మీనన్.

'డిజిటల్ ప్లాట్ ఫాం నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. మంచి ఆఫర్ అయితే వెబ్ సీరీస్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే, ఒకటి... స్క్రిప్టు, నా పాత్ర నచ్చితేనే కమిట్ అవుతాను' అని చెప్పింది నిత్యా. ఇక ఈ లాక్ డౌన్ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పింది.

'కరోనా కారణంగా బయటికి వెళ్లడానికి వీల్లేదు కదా.. ఇంట్లోనే వున్నాను. ఈ ఖాళీ సమయాన్ని నా గురించి నేను విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకున్నాను. ఇంతవరకు ఏం చేశాను? ఇంకా ఏం చేయాలి? వంటి విషయాలను నాకు నేను ఎనలైజ్ చేసుకున్నాను' అని తెలిపింది నిత్యా మీనన్.

  • Loading...

More Telugu News