Andhra Pradesh: రెండు చట్టాలను నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసిన ఏపీ సర్కారు

AP government releases Gazettes for CRDA Repeal Bill and Decentralization Bill
  • సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం
  • రెండింటికి వేర్వేరుగా గెజిట్లు
  • గెజిట్లు రూపొందించిన న్యాయశాఖ
సీఆర్డీయే రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో, ఏపీ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ చట్టాలను నోటిఫై చేస్తూ వేర్వేరుగా గెజిట్లు రూపొందించారు. ఆయా గెజిట్లలో నిర్దేశిత చట్టాలకు సంబంధించిన ఉద్దేశం, అమలు విధివిధానాలు, పరిధి తదితర అంశాలు పొందుపరిచారు. ఈ గెజిట్లను ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయశాఖ విడుదల చేసింది.

 
Andhra Pradesh
Gazette
CRDA Bill
Decentralization Bill
Governor

More Telugu News