Sonu Sood: ఆ ముగ్గురు చిన్నారుల బాధ్యత ఇక నాదే: సోనూ సూద్

Sonu Sood assured three children in Yadadri no longer orphans
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో అనాథలుగా మారిన చిన్నారులు
  • ఆ ముగ్గురు చిన్నారులను ఆదుకోవాలంటూ నెటిజన్ల విజ్ఞప్తి
  • ఇక వాళ్లు ఎంతమాత్రం అనాథలు కాదన్న సోనూ సూద్
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తనలోని మానవతా దృక్పథానికి పరిమితులు లేవని మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు అనాథ చిన్నారుల బాధ్యతలను ఇకపై తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు.  

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆ చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారని, వారిలో కాస్త పెద్దవాడు మిగిలిన ఇద్దరి ఆలనా పాలనా చూస్తున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. మీడియాలో వచ్చిన ఓ క్లిప్పింగ్ ను రాజేశ్ కరణం అనే వ్యక్తి సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ముగ్గురు చిన్నారులకు ఎవరూ లేరని, మీరే ఆదుకోవాలని సూచించాడు. దీనిపై సోనూ వెంటనే స్పందించాడు. వారు ఇక ఎంతమాత్రం అనాథలు కారని ఆయన స్పష్టం చేశారు.

Sonu Sood
Three Children
Orphans
Yadadri Bhuvanagiri District

More Telugu News