Nara Lokesh: మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై నారా లోకేశ్ స్పందన!

One capital is TDPs slogan says Nara Lokesh
  • ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదం
  • ప్రజల ఆకాంక్షలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుంది
  • అమరావతిని పరిరక్షించుకు తీరుతాం
మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
Nara Lokesh
Telugudesam
3 capitals

More Telugu News