Pathipati Pullarao: ప్రత్తిపాటి పుల్లారావు పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం
- గణపవరంలోని పత్తిమిల్లులో ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు
- రూ. 40 లక్షల వరకు ఆస్తి నష్టం
టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో ఉన్న మిల్లులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు ఫైర్ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో రూ. 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.