Adi Pinisetty: తనతో కలిసి నటించిన హీరోయిన్ ను పెళ్లాడబోతున్న ఆది పినిశెట్టి?

Adi Pinisetty to marry his co star Nikki Galrani
  • నిక్కీ గల్రానీని ఆది పెళ్లాడబోతున్నట్టు ప్రచారం
  • గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు
  • రెండు చిత్రాల్లో కలిసి నటించిన ఆది, నిక్కీ
టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలంతా వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా మరో హీరో ఆది పినిశెట్టి కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ నిక్కీ గల్రానీని ఆది పెళ్లాడబోతున్నాడట. తమిళ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది.

ఆది, నిక్కీ గల్రానీ ఇద్దరు కలిసి 'మలుపు', 'మరకతమణి' చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలకు కూడా నిక్కీ హాజరైంది. అయితే, ఈ వార్తలపై ఇంతవరకు ఆది కానీ, నిక్కీ కాని స్పందించలేదు. మరోవైపు, త్వరలోనే తమ పెళ్లి గురించి ఆది ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Adi Pinisetty
Nikki Galrani
Marriage

More Telugu News