ఓ ముఠా ట్రాప్ లో చిక్కుకుని పెళ్లి వరకు వెళ్లి బయటపడ్డాను: హీరోయిన్ పూర్ణ
- పెళ్లి పేరుతో పూర్ణ కుటుంబాన్ని సంప్రదించిన ముఠా సభ్యులు
- అన్ని విషయాలు మాట్లాడుకున్నాక నిజస్వరూపం తెలిసిందన్న పూర్ణ
- పెళ్లంటేనే భయం వేస్తోందని వెల్లడి
"పెళ్లి దాదాపు నిశ్చయమైంది. అవతలి కుటుంబంతో మా అమ్మానాన్న మాట్లాడారు. నేను కూడా కాబోయే భాగస్వామితో భవిష్యత్ జీవితంపై ఆలోచనలు పంచుకున్నాను. ఆ తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయి. ఆ ముఠా అంతరంగం అర్థమైంది. ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నట్టు నటించి మోసం చేశారు. ఈ ఘటనతో పెళ్లంటేనే భయం వేస్తోంది. మనుషులపై నమ్మకం పోతోంది. నాకు పెళ్లి సంబంధాలు చూడవద్దని మా అమ్మానాన్నలకు చెప్పేశాను" అని వివరించారు.