Sensex: అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు
  • 335 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 100 పాయింట్లు పతనమైన నిఫ్టీ
Stock Markets extends losses for straight second day

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. మెటల్, ఎనర్జీ, ఫైనాన్సియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 37,736కి పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు పతనమై 11,102కి దిగజారింది. ఈనాటి ట్రేడింగ్ లో హెల్త్ కేర్, ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను చవిచూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.44%), మారుతి సుజుకి (0.99%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.61%), ఇన్ఫోసిస్ (0.75%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.30%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.62%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.64%), యాక్సిస్ బ్యాంక్ (-3.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.64%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.43%).

More Telugu News