Priest: అయోధ్య రామజన్మభూమిలో కరోనా కలకలం... పూజారికి పాజిటివ్

Ayodhya Ram Mandir priest tested corona positive
  • పూజారి ప్రదీప్ దాస్ కు కరోనా
  • మరో 16 మంది భద్రతా సిబ్బందికి కూడా పాజిటివ్
  • ఆగస్టు మొదటి వారంలో భూమి పూజ
మరికొన్నిరోజుల్లో అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో కరోనా కలకలం రేగింది. రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అంతేకాదు, రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులు కూడా కరోనా బాధితులయ్యారు. దాంతో వారు క్వారంటైన్ లోకి వెళ్లారు.

ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు రానున్న వేళ పూజారికే కరోనా సోకడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు వీఐపీలు రానున్నట్టు తెలుస్తోంది. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Priest
Ayodhya Ram Mandir
Corona Virus
Positive
Bhumi Pujan

More Telugu News