Sonu Sood: భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన 'రియల్ హీరో' సోనూసూద్.. వీడియో ఇదిగో

sonu sood breaks down
  • ‘ది కపిల్‌ శర్మ’ షోకు గెస్ట్‌గా సోనూసూద్‌ 
  • కూలీలకు సంబంధించిన వీడియోలను చూపిన నిర్వాహకులు
  • సోనూసూద్‌కి కృతజ్ఞతలు తెలిపిన కూలీలు
కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సినీనటుడు సోనూసూద్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు సొంత గ్రామాలకు చేరడానికి ఆయన సాయం చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపిన వీడియో క్లిప్‌లను ఓ టీవీ ఛానెల్‌ సోనూసూద్ కు చూపించింది. వాటిని చూస్తూ భావోద్వేగానికి గురైన సోనూసూద్ కంటతడి పెట్టారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రసారం అవుతున్న ‘ది కపిల్‌ శర్మ’ షోకు సోనూసూద్‌ గెస్ట్‌గా వస్తున్నారు. ఈ సమయంలోనే పలువురు కూలీలకు సంబంధించిన వీడియోలను ఆ టీవీ షో నిర్వాహకులు చూపించారు.

సోనూసూద్‌ చేసిన సాయం వల్ల తాము సొంతూరికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తున్నామని కూలీలు అన్నారు. కాగా, ఈ వీడియో క్లిప్‌లు చూసిన అనంతరం కపిల్‌శర్మ షో ఎప్పటిలాగే నవ్వులతో కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ టీవీ ఛానెల్ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.                                                                                         
Sonu Sood
Bollywood
Corona Virus
Viral Videos

More Telugu News