SS Rajmouli: బాహుబలిని పిలిచి కరోనాను తన్ని తరిమేయండి: రాంగోపాల్ వర్మ

call ur soldier Bahubali and get corona kicked RGV tweeted
  • తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్టు ట్వీట్ చేసిన రాజమౌళి
  • రోజుకో గుడ్డు తింటే పరార్ అన్న బండ్ల గణేశ్
  • వెరైటీగా స్పందించిన రాంగోపాల్ వర్మ
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా బారినపడినట్టు గత రాత్రి స్వయంగా ట్వీట్ చేయడంతో కలకలం రేగింది.  రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిన తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకుంటే వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. తమలో  కరోనా లక్షణాలు లేనప్పటికీ నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన వెంటనే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏమీ కాదని, హ్యాపీగా ఉండాలని సూచించారు. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే త్వరగా కోలుకోవచ్చని చెప్పారు. కాగా, గణేశ్ కూడా ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. తాజాగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ చమత్కారంగా స్పందించారు. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారని, కాకపోతే అంతకంటే ముందు మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనా వైరస్‌ను తన్నాలని చెబితే సరిపోతుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
SS Rajmouli
RGV
Bandla Ganesh
Corona Virus
Tollywood

More Telugu News