Rea Chakravarthy: సుప్రీంకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రియా చక్రవర్తి

Actress Rea Chakravarthy files petition in Supreme Court
  • సుశాంత్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న బీహార్ పోలీసులు
  • కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని రియా పిటిషన్
  • ఒకే కేసును రెండు పోలీసు బృందాలు విచారించడంపై అభ్యంతరం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక అజ్ఞాత వ్యక్తికి 15 కోట్లు బదిలీ కావడంలో రియా పాత్ర వున్నట్టు అనుమానంగా వుందని, దీనిపై విచారణ జరపాలని ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్ లోని పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో, బీహార్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ఇదే సమయంలో ముంబై పోలీసులు కూడా రియాను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులకు కేసును అప్పగించాలని సుప్రీంకోర్టును రియా ఆశ్రయించింది. రెండు పోలీసు బృందాలు ఒకే కేసును విచారిస్తుండటం సరికాదని పిటిషన్ లో పేర్కొంది.

ఈ సందర్భంగా రియా తరపు లాయర్ మాట్లాడుతూ, ఇప్పటికే ముంబై పోలీసులు కేసును విచారిస్తున్నారని.... అన్ని విషయాలు ప్రజలకు తెలుసని... ఈ నేపథ్యంలో, అదే కేసుకు సంబంధించి మరో ఎఫ్ఐఆర్ నమోదు కావడం చట్టవిరుద్ధమని అన్నారు.

బీహార్ నుంచి వచ్చిన పోలీసు బృందం ముంబైలో కేసును విచారిస్తోంది. ఈరోజు ఆరుగురు వ్యక్తులను పోలీసులు విచారించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Rea Chakravarthy
Sushant Singh Rajput
Bollywood

More Telugu News