Sudheer Babu: సినిమా స్టూడియో నెలకొల్పే ఆలోచనలో ఉన్న మహేశ్ బాబు బావ!

Actor Sudheer Babu trying to establish a studio
  • కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న సినీ స్టార్లు
  • ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న సుధీర్ బాబు
  • స్టూడియో కోసం స్థలం వెతుకుతున్నానని వ్యాఖ్య
కరోనా నేపథ్యంలో సినీ స్టార్లకు కావాల్సినంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగులు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటూ వారికి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణగారి అల్లుడు, మహేశ్ బాబు బావ సుధీర్ బాబు కూడా కరోనా సమయంలో హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్నాడు.

తదుపరి సినిమాలకు సన్నాహకాలు చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిట్ నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ, ఒక సినిమా స్టూడియో నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. స్టూడియో కోసం స్థలాన్ని వెతుకుతున్నానని చెప్పాడు.
Sudheer Babu
Mahesh Babu
Tollywood

More Telugu News