Aishwarya Rai: కరోనా నుంచి కోలుకున్నాక ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్ చేసిన ఐశ్వర్యరాయ్!

aishwaray first post after discharging from hospital
  • మా కోసం అభిమానులు చేసిన ప్రార్థనలకు థ్యాంక్స్ 
  • మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు
  • ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్య 
  • ప్రజలంతా సురక్షితంగా ఉండాలి
సినీనటి ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. తమ కోసం అభిమానులు చేసిన ప్రార్థనలకు, వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

అభిమానులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, భగవంతుడు వారిని చల్లగా చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అభిమానుల పట్ల తన ప్రేమ, ప్రార్థనలు ఎల్లప్పుడూ  ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలంతా సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

కాగా, కరోనా నెగెటివ్ అని తేలడంతో ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ అయినప్పటికీ అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్ మాత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పరీక్షల్లో వారికి ఇంకా నెగెటివ్ రాలేదు.
Aishwarya Rai
Bollywood
Corona Virus

More Telugu News