vishal: కరోనా నుంచి ఇలా కోలుకున్నాం!: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vishal  shares his experience of getting cured from COVID situation
  • నేను, నా తండ్రి, మా మేనేజ‌ర్ కోలుకున్నాం
  • కరోనా నుంచి ఎలా కోలుకున్నామో మీ అంద‌రికీ చెబుతా
  • మేం ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్ తీసుకున్నాం 
  • ఎంతో ధైర్యంతో కరోనాను ఎదుర్కొన్నాం 
తాను, తన తండ్రి, తమ మేనేజ‌ర్ కరోనా నుంచి ఎలా కోలుకున్నామో అంద‌రికీ చెప్పాల‌నుకుంటున్నానని సినీ హీరో విశాల్ ఓ ప్రకటన చేశారు.

'ఏ విధ‌మైన ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్‌ను నేను ప్ర‌మోట్ చేయ‌డంలేదు. అయితే, కేవ‌లం ఈ మెడిసిన్ ద్వారా  నేను, మా నాన్న గారు, మా మేనేజ‌ర్ వైరస్ నుంచి ఎలా కోలుకున్నామో మీ అంద‌రికీ చెప్పాల‌న్న‌దే నా కోరిక.

మా అంకుల్‌ డాక్ట‌ర్ హరిశంకర్ గారి స‌‌మ‌క్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్ తీసుకున్నాం. ఎంతో ధైర్యంతో కరోనాను ఎదుర్కొన్నాం. ఈ కారణాల వల్ల మూడు వారాల్లో మేము ముగ్గురం కరోనా నుంచి కోలుకున్నాం' అని విశాల్ చెప్పాడు. అందరూ ధైర్యంగా ఉండాలని, కరోనాను తప్పకుండా జయించగలమని ఆయన తెలిపాడు.

                             
vishal
Tollywood
Corona Virus

More Telugu News