ఐదు నెలల తరువాత మేకప్ వేసుకున్న నాగార్జున!
- మార్చి నుంచి ఇంటికే పరిమితం
- బిగ్ బాస్ ప్రోమో షూటింగ్ కు హాజరు
- అన్ని జాగ్రత్తలతో షూటింగ్ పూర్తి
అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. సినిమా షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు లభించిన తరువాత, తొలిసారిగా మేకప్ వేసుకున్న పెద్ద హీరో నాగార్జునే కావడం గమనార్హం. ఇక, హౌస్ లోకి ప్రవేశించే కంటెస్టెంట్ లు షో ప్రారంభానికి రెండు వారాల ముందు నుంచే క్వారంటైన్ లో ఉండాలని నిర్వాహకులు ఆదేశించనున్నారని సమాచారం. హౌస్ లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.