Sonu Sood: కంగనా రనౌత్ పై విమర్శలు గుప్పించిన సోనూసూద్

Sonu Sood reacts on Kangana Ranaut
  • సుశాంత్ మరణాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం బాధ కలిగిస్తోంది
  • పబ్లిసిటీ కోసమే అలా చేస్తున్నారు
  • సుశాంత్ ను కలవని వారు కూడా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ పలువురు ప్రముఖులను ఆమె టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్ స్పందిస్తూ, కంగనాపై మండిపడ్డాడు.

మరణించిన వ్యక్తిని అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం పోరాడటం సరైన పద్ధతి కాదని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సుశాంత్ ను ఏరోజూ కలవని వారు కూడా అతని గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారని విమర్శించాడు. సుశాంత్ మరణం గురించి మాట్లాడుతున్న వారంతా పబ్లిసిటీ కోసమే అలా చేస్తున్నారని దుయ్యబట్టాడు. సుశాంత్ ను ఇలా వాడుకుంటున్న పద్ధతి తనకు ఆవేదన కలిగిస్తోందని చెప్పాడు.
Sonu Sood
Kangana Ranaut
Bollywood
Sushant Singh Rajput

More Telugu News