Varla Ramaiah: సోనూ సూద్ జాలిపడి ఓ దళితుడికి ట్రాక్టర్ ఇస్తే దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారా?: వర్ల రామయ్య

Varla Ramaiah responds on Chittoor district farmer issue
  • చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ పంపిన సోనూ సూద్
  • ఆ రైతు పేదవాడు కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్ల రామయ్య
చిత్తూరు జిల్లాలో నాగేశ్వరరావు అనే రైతుకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఓ ట్రాక్టర్ కానుకగా పంపడం, ఆ తర్వాత రైతు నాగేశ్వరరావు పేదవాడు కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తదితర అంశాలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అంటూ సీఎం జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

'అతనెవరో సోనూ సూద్... జాలిపడి మన రాష్ట్రంలో ఓ దళిత కుటుంబానికి ట్రాక్టర్ బహుమతిగా ఇస్తే దానిని కూడా చెడగొట్టడానికి మీ కార్యకర్తలు ప్రయత్నించడం ఘోరం, క్షమించరాని నేరం' అంటూ మండిపడ్డారు. మీ ప్రభుత్వం సాయం చేయదు, చేసేవారిని చేయనివ్వదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Sonu Sood
Tractor
Farmer
Chittoor District
Jagan
YSRCP

More Telugu News