Narendra Modi: అయోధ్య భూమిపూజకు హాజరవుతున్న మోదీ.. వెలువడిన అధికారిక ప్రకటన!

Modi to attend Ayodhya Ram Mandir ground breaking ceremony
  • వచ్చే నెల 5వ తేదీన అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ
  • మోదీ హాజరవుతున్నట్టు ప్రకటించిన పీఎంఓ
  • కార్యక్రమానికి హాజరుకానున్న 250 మంది ప్రముఖులు
అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే నెల 5వ తేదీ ఉదయం భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు మరో 250 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు, ఆలయం నిర్మాణం కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఉన్నారు. ప్రధాని మోదీకి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ ఆహ్వానం పంపారు. అయితే, కార్యక్రమానికి మోదీ హాజరయ్యే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని వీక్షిస్తారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటికీ తెరదించుతూ... ప్రధాని కార్యాలయం ఈరోజు ప్రకటనను వెలువరించింది.
Narendra Modi
BJP
Ayodhya Ram Mandir

More Telugu News