Nara Lokesh: పేదలకు చెత్త బండి.. గద్దెనెక్కిన పెద్దలకు పక్క రాష్ట్రాల కార్పొరేట్ ఆసుపత్రులా?: నారా లోకేశ్

Nara Lokesh fires on taking corona patient in municipality vehicle
  • ప.గో. జిల్లాలో కరోనా బాధితుడిని చెత్త బండిలో తరలించిన వైనం
  • అంబులెన్స్ కి కాల్ చేసినా స్పందన రాలేదన్న లోకేశ్
  • పబ్లిసిటీ అంబులెన్స్ అయితే... రియాలిటీ చెత్త బండి అని వ్యాఖ్య
పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో కరోనా బాధితుడిని చెత్త బండిలో ఆసుపత్రికి తరలించిన ఘటన విమర్శలకు తావిస్తోంది. 108కి ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

'ఓటేసిన పేదలు అనారోగ్యానికి గురైతే చెత్త‌బండిలో ఏపీ స‌ర్కారు ద‌వాఖానాకా? గ‌ద్దెనెక్కిన పెద్దలకి కరోనా సోకితే ప్ర‌త్యేక విమానంలో ప‌క్క ‌రాష్ట్రాల కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కా? ఇదెక్కడి న్యాయం, ఇదేం పాలన? పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో అంబులెన్స్ కి కాల్ చేసినా స్పందన లేకపోవడంతో చెత్తబండిలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని తరలించడం బాధాకరం. పబ్లిసిటీ అంబులెన్స్ అయితే... రియాలిటీ చెత్త బండి అయ్యింది' అని లోకేశ్ మండిపడ్డారు.
Nara Lokesh
Telugudesam
Corona Virus

More Telugu News