India: భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Indias COVID tally cross 14 Lakhs mark with 708 deaths
  • మొత్తం కేసులు 14,35,453
  • మృతుల సంఖ్య మొత్తం 32,771
  • 4,85,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారి సంఖ్య 9,17,568   
భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది. 4,85,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,68,06,803 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 5,15,472 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

India
Corona Virus
COVID-19

More Telugu News