Anurag Vardhaman: టీటీడీకి రూ.2.1 కోట్ల విరాళం ఇచ్చిన చెన్నై భక్తుడు

Devotee from Chennai donates huge some for TTD
  • స్వామివారికి విరాళం ఇచ్చిన అనురాగ్ వర్ధమాన్ అనే భక్తుడు
  • యాక్సెస్ హెల్త్ కేర్ సంస్థ తరఫున విరాళం
  • టీటీడీ అడిషనల్ ఈవోకి చెక్కులు అందజేత
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీనివాసుడికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు భారీగా విరాళం అందించారు. అనురాగ్ వర్ధమాన్ అనే ఆ భక్తుడు టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2.1 కోట్ల విరాళం అందజేశారు. అనురాగ్ వర్ధమాన్ చెన్నైకి చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ సంస్థకు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తమ సంస్థ తరఫున వర్ధమాన్ విరాళం తాలూకు చెక్కులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
Anurag Vardhaman
TTD
Tirumala
Donation
Chennai

More Telugu News