Samantha: రికార్డు స్థాయిలో ఫాలోవర్లు.. థ్యాంక్స్ చెప్పిన సమంత

Samantha gets Eleven Million followers in Instagramme
  • సోషల్ మీడియాలో తారల సందడి 
  • ఇన్ స్టాలో సమంతకు 11 మిలియన్ల ఫాలోవర్లు
  • తన ఫొటోలతో వీడియో పోస్ట్ చేసిన సమంత
ఇటీవలి కాలంలో సినిమా తారలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుంటున్నారు. ముఖ్యంగా కథానాయికలైతే మరీనూ. తమ సినిమాల గురించే కాకుండా పర్శనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు లైవ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇస్తూ వారికి మరింత దగ్గరవుతున్నారు.

అందాలతార, అక్కినేని వారి కోడలు సమంత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అరుదైన మైలురాయిని కూడా చేరుకుంది. ఏకంగా 11 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో సమంత సంబరపడుతూ అభిమానులకి థ్యాంక్స్ చెప్పింది.

"మంచి వాళ్లతో మరింత మంచి ప్రయాణం.. ఎన్నో ఎత్తుపల్లాలు..మంచీ చెడు ... అన్నింటా నా కోసం మీరు వున్నట్టుగానే, మీ కోసం నేను ఉన్నట్టుగా భావిస్తున్నాను..' అంటూ ఈ ముద్దుగుమ్మ అభిమానుల కోసం ఓ పోస్ట్ కూడా పెట్టింది. దీంతో పాటు గత పదేళ్ల తన సినిమాలలోని పలు ఫొటోలతో కూడిన వీడియోని కూడా షేర్ చేసింది. దీంతో శామ్ అభిమానులంతా తెగ ఆనందపడిపోతూ ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.  
Samantha
Akkineni
Instagram

More Telugu News