Hyderabad: హైదరాబాద్‌లో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న బాబా అరెస్టు

police arrests baba in hyderabad
  • సమస్యలు తీర్చుతానంటూ తాయత్తులు కట్టే బాబా
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త బిజినెస్
  • భక్తుల నుంచి రూ.12 వేలు చొప్పున వసూలు
  • అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఓ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్‌లో ఇస్మాయిల్‌ బాబా అనే వ్యక్తి భక్తుల్లో ఉండే భయాన్ని ఆసరాగా తీసుకుని, వారి సమస్యలు తీర్చుతానంటూ వారికి తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునే వాడు. ప్రజల్లో కరోనా భయం ఎక్కువయిపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు.

కరోనా రాకుండా చేస్తానని వారిని నమ్మించాడు. కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్‌ బాబాను హఫీజ్‌పేట్‌ హనీఫ్‌ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Hyderabad
Police

More Telugu News