Nimmagadda Ramesh: నిమ్మగడ్డ తరపున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే..  సుప్రీంకోర్టుకు ఏం చెప్పారంటే..!

What lawyer Harish Salvey told to Supreme Court in Nimmagadda case
  • కోర్టుల తీర్పులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు
  • హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చింది
  • కోర్టులు, జడ్జిలపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిని సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ తరపున కోర్టులో ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

కోర్టులు ఇచ్చిన తీర్పులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు హరీశ్ సాల్వే తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చిందని... అందువల్ల స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ నేతలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టులు, జడ్జిలు, జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడిన క్లిప్పింగ్స్ ను తమకు అందజేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కోరింది. నిమ్మగడ్డ విషయంలో ప్రతి అంశం తమకు తెలుసని... అందుకే కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వడం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ లేఖను కూడా పట్టించుకోకపోవడం దారుణమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News