Bhagyashree: ప్రభాస్ తో మాట్లాడిన తర్వాత ఆశ్చర్యపోయాను: భాగ్యశ్రీ

Prabhas is a great person says Bhagyashree
  • 'బాహుబలి' చూసినప్పుడే ప్రభాస్ పై మంచి అభిప్రాయం ఏర్పడింది
  • ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు
  • అతని కలుపుగోలుతనం, మర్యాద చూసి ఆశ్చర్యపోయా
పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్న ప్రభాస్ పై బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రశంసలు కురిపించారు. 'బాహుబలి' సినిమా చూసినప్పుడే ప్రభాస్ పై తనకు ఒక మంచి అభిప్రాయం కలిగిందని చెప్పారు. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడని అన్నారు.

అయితే ఒక సూపర్ స్టార్ కు ఉండే గర్వం, అహంకారం అతనిలో లేవని చెప్పారు. ప్రభాస్ ఎంతో నిరాడంబరంగా ఉంటాడని... అతని కలుపుగోలుతనం, మర్యాద ఇచ్చే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడతాడని... అతనొక టీమ్ ప్లేయర్ అని కితాబునిచ్చారు. ప్రభాస్ పద్ధతిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.

ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' లో ప్రభాస్ తల్లి పాత్రను భాగ్యశ్రీ పోషిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
Bhagyashree
Prabhas
Tollywood
Bollywood

More Telugu News